ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి.

business |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 07:11 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలతో ఈ ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు కాసేపు ఒత్తిడికి గురయ్యాయి. ఆ తర్వాత ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 76,759 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 23,249 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:


భారతి ఎయిర్ టెల్ (2.78%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.59%), బజాజ్ ఫైనాన్స్ (1.82%), నెస్లే ఇండియా (1.73%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.51%).


టాప్ లూజర్స్:


టాటా మోటార్స్ (-7.37%), ఐటీసీ హోటల్స్ (-4.98%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.12%), అదానీ పోర్ట్స్ (-1.86%), జొమాటో (-1.66%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com