దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరోసారి తమ యూజర్లకు షాకిచ్చింది. తమ రెండు డేటా ప్యాక్స్ వ్యాలిడిటీని తగ్గించింది. ఇటీవలే పలు ప్లాన్లలో డేటాను తొలగించగా.. ఇప్పుడు రెండు డేటా ప్లాన్ల వ్యాలిడిటీని తగ్గించింది. రూ.69, రూ.139 డేటా ప్యాక్స్ వ్యాలిడిటీని కుదించింది. ఇకపై ఈ రెండు ప్లాన్ల వ్యాలిడిటీని ఏడు రోజులకు పరిమితం చేసింది. గతంలో ఇవి యూజర్ బేస్ ప్లాన్లతో అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రస్తుత ప్యాక్ గడువు ముగియడానికి ఇంకా ఓ 20 రోజుల గడువు ఉంటే ఈ డేటా ప్యాక్స్‌తో రీఛార్జ్ చేసుకున్నట్లయితే వ్యాలిడిటీ పూర్తయ్యే వరకు వ్యాలిడిటీ ఉండేది. తాజాగా ఆ వెసులుబాటును జియో తొలగించింది. ఈ రెండు ప్లాన్లను వారానికే పరిమితం చేసింది.
ప్రస్తుతం జియో ప్రీపెయిడ్ ప్లాన్లలో డేటా పూర్తయినప్పుడు ఎక్కువ మంది డేటా బూస్టర్‌తో రీఛార్జ్ చేసుకుంటారు. రూ. 69తో రీఛార్జ్ చేసుకున్న వారికి 6జీబీ డేటా వస్తుంది. ప్లాన్ చివరి వరకు ఈ డేటా వ్యాలిడిటీ కొనసాగేది. కానీ, ఇకపై ఎప్పుడు రీఛార్జ్ చేసుకుంటే అప్పటి నుంచి వారం రోజులు మాత్రమే పని చేస్తుంది. ఇక రూ.139తో రీఛార్జ్ చేసుకున్న వారికి 12జీబీ డేటా వస్తుంది. ఇది కూడా ప్లాన్ వ్యాలిడిటీ ముగిసే వరకు కొనసాగాల్సి ఉండగా దీనిని సైతం వారానికి కుదించింది. రీఛార్జ్ చేసిన రోజు నుంచి ఏడు రోజులు మాత్రమే ఈ డేటా వ్యాలిడిటీ లభిస్తుంది.
మరోవైపు.. ఒక గంట వ్యాలిడిటీతో రూ. 11 ప్లాన్ అందుబాటులో ఉంది. దీని ద్వారా అన్లిమిటెడ్ డేటా ఉంటుంది. అలాగే 1 రోజు వ్యాలిడిటీతో రూ. 19 డేటా ప్లాన్ అందుబాటులో ఉంది. అలాగే ఇటీవలే తొలగించిన రూ. 189 ప్లాన్ ను జియో తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 2జీబీ డేటా లభిస్తుంది. దీని ద్వారా అపరిమిత కాల్స్, 300 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.