అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ సహా భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఓటమి నుంచే పట్టుదల పెరుగుతుంది. ఎనిమిది నెలల కాలంలో ఇంత వ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వం లేదు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అయన మాట్లాడుతూ..... చంద్రబాబు సూపర్ సిక్స్‌కు పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఇచ్చారు. బీజేపీ గ్యారంటీ ఇవ్వలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటానంటే ఆయన భార్య, కొడుకు ఒప్పుకునేలా లేరు.
వైయస్ఆర్‌సీపీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడానికి లోకేష్ ఒక్కడు చాలు. లోకేష్‌కు దండం పెట్టిన వాడికి మంత్రి పదవి ఇచ్చారు. ఉభయ రాష్ట్రాలలో మంచి పేరున్న నాయకుడు బొత్స సత్యనారాయణ. పార్టీ ఓడినా మండలి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న వ్యక్తి బొత్స. 164 స్థానాలు ఎందుకు వచ్చాయో కూటమి నేతలకే అర్ధం కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పునఃనిర్మాణం జరుగుతుంది. ధర్మశ్రీని ఢిల్లీ పంపాలని వైయస్ జగన్ నిర్ణయించారు’ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ చేశారు.