సీఐడీ మాజీ అదనపు డీజీ సంజయ్ సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన నిర్వహించిన శాఖల్లో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన అంశం వెలుగులోకి వచ్చాక కూటమి ప్రభుత్వం గతేడాది డిసెంబరు 3న ఆయనను సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన కమిటీ జనవరి 29న సస్పెన్షన్‌పై సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన ఆరోపణలు ఉండడంతో ఆయన సస్పెన్షన్‌ను మే 31 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. కమిటీ సూచనల మేరకు సంజయ్ సస్పెన్షన్‌ను కొనసాగిస్తున్నట్లు దీనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ప్రభుత్వం సూచించింది.