ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా కోలాహలంగా కొనసాగుతుంది. ఈ మహాకుంభమేళా కు ఎక్కడెక్కడి నుంచో అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ తరుణంలో త్రివేణి సంగమంలో తలస్నానం చేసి పాపాలు పోగొట్టుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులు, మహిళలు, సాధువులు, సన్యాసులు వస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేక ఏర్పాట్లు చేసింది.ఇందులో భక్తులు బస చేసేందుకు సౌకర్యాలు కల్పించింది. ఇవే కాకుండా పోర్టబుల్ టాయిలెట్లను తయారు చేశారు. తాగునీటి కోసం కుళాయిలు ఏర్పాటు చేశారు. కానీ కొంతమంది మాత్రం తమ అలవాటును వదులుకోవడం లేదు. అయితే మహాకుంభమేళలో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో స్నానాలు చేస్తున్నారు. తడిబట్టలతో స్నానం చేసి తమ పాపాలు కడిగేసుకుంటున్నారు. కొందరు మాత్రం వింత చేష్టలతో ప్రవర్తిస్తూ భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అయితే రీల్స్ చేసుకునేందుకు ఇక్కడికి వచ్చి విమర్శల పాలవుతున్నారు.