పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలని అందుకోసమే విజ్ఞాన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో తొలిసారిగా బాల మహోత్సవ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య అన్నారు. గుంటూరు సమీపంలోని వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి బాల మహోత్సవ్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ మొబైల్ ఫోన్‌ను సాధ్యమైనంత తక్కువగా విద్యార్థులు వినియోగించాలన్నారు. జంక్ ఫుడ్ తినకుండా సంప్రదాయ ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులు రోజూ మైదానంలో ఆటలు ఆడుకునేలా ప ప్రోత్సహించాలని, అప్పుడే వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు. జీవితంలో కష్టపడి పనిచేయడంతో పాటు బాగా కృషి చేసిన వారే ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ఆచార్య పి.నాగభూషణ్ అన్నారు. కలల సాకారానికి అంకితభావంతో కృషి చేేస్త ఉన్నతంగా ఎదిగే శక్తి సామర్థ్యాలు విద్యార్థుల్లో ఉంటాయన్నారు. ఈ సందర్భంగా 50 అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.