రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి శనివారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి పట్టణంలోని తమ క్యాంపు కార్యాలయంలో పూల బొకే అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా అభివృద్ధిపై పలు అంశాల గురించి చర్చించారు.