ఆమదాలవలస పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు నిర్వహించనున్నట్టు ఆమదాలవలస రంగస్థలం కళాకారుల సంఘ అధ్యక్షుడు, టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్ తెలిపారు. శుక్రవారం పాలపోలమ్మ ఆలయ ఆవరణలో కార్యదర్శి పేడాడ వెంకట ప్రతాప్‌కుమార్ ఆధ్వర్యంలో నాటిక పోటీల బ్రోచర్లను ఆవిష్కరించారు. మూడు రోజులు నిర్వహించే ఈ నాటిక పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పాత్రుని పాపారావు, సనపల అన్నాజీరావు, గొండు రవి, బొడ్డేపల్లి జనార్దనరావు, కాగితాపల్లి సంజీవరావు పాల్గొన్నారు.