వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్య కాలంలో పెట్టిన అక్రమకేసుల నుండి టీడీపీ కార్యకర్తలకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పాత్రికేయులకు వీలైనంత త్వరగా ఉపశమనం కలిగేలా చూడాలని టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ రౌడీలు చేసిన అరాచకాలపై విచారణకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటుకు నిర్ణయించారు.