ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, దీంతో శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక లకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్, 10వరకు నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని, మార్చి 8వ తేదీతో ఎన్ని కల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. తుది ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 31 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా పరిధిలో మొత్తం ఓటర్లు 4,829 కాగా అందులో పురుషులు 3,275, మహి ళా ఓటర్లు 1554 మంది ఉన్నారన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియ మావళి పాటించాలని, అధికారులు, నా యకులకు సూచించారు. నియమావళి అమలుకు నోడల్ టీమ్‌లను ఏర్పాటు చేశామని, నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన అనుమతులను వివరించారు. సమావేశంలో ఆర్డీవో సాయిప్రత్యూష, టీడీిపీ నుంచి పీఎంజే బాబు, కాంగ్రెస్ పార్టీ నుంచి కేవీఎల్‌ఎస్ ఈశ్వరి, బీఎస్పీ నుంచి లాసా సోమేశ్వరరావు, వైసీపీ నుంచి రౌతు శంకరరావు, బీజేపీ నుంచి సురేష్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.