కేంద్ర బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ అలెర్ట్ అయ్యింది.. బడ్జెట్ లో రాష్ట్రానికి వస్తున్న ప్రయోజనాలు.. నిధులకు సంబంధించి మద్యాహ్నం 3 గంటలలోగా నివేదిక ఇవ్వాలని అన్నిశాఖలకు ఆర్ధికశాఖ సూచనలు చేసింది..అన్ని శాఖల నుంచి సమాచారం వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనుంది ఆర్థిక శాఖ.. ఆంధ్రప్రదేశ్ లో నదుల అనుసంధానానికి కేంద్రాన్ని నిధులు కోరింది ఏపీ ఆర్ధిక శాఖ. తుఫాన్‌లు, రాయలసీమ ప్రాంతంలో కరువు ప్రాంతంతో పాటు.. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి భారీగా నష్టం జరిగిందని కేంద్రానికి ఆర్ధిక శాఖ వివరణ ఇచ్చింది.. ఏపీకి కేంద్ర ప్రయోజిత పథకాల్లో 90 శాతం నిధులు వచ్చేలా చూడాలని ఆర్ధిక శాఖ కోరింది.. రోడ్లు.. పోర్టులు.. విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది ఏపీ ప్రభుత్వం..కాగా, వార్షిక బడ్జెట్ 2025-26ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు.. రూ.50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్ ఉండగా.. రెవెన్యూ వసూళ్లు రూ.34,20,409 కోట్లు పన్ను వసూళ్లు రూ.28,37,409 కోట్లుగా.. పన్నేతర వసూళ్లు రూ.5,83,000 కోట్లుగా.. మూలధన వసూళ్లు రూ.16,44,936 కోట్లుగా.. రుణాల రికవరీ రూ.29,000 కోట్లుగా.. ఇతర వసూళ్లు రూ.47,000 కోట్లుగా.. అప్పులు, ఇతర వసూళ్లు రూ.15,68,936 కోట్లుగా.. మొత్తం ఆదాయం రూ.50,65,345 కోట్లుగా పేర్కొన్నారు.. ఇక, మొత్తం వ్యయం రూ.50,65,345 కోట్లు కాగా.. రెవెన్యూ ఖాతా రూ.39,44,255 కోట్లు.. వడ్డీ చెల్లింపులు రూ.12,76,338 కోట్లు.. మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,27,192 కోట్లు.. మూలధన ఖాతా రూ.11,21,090 కోట్లు.. వాస్తవ మూలధన వ్యయం రూ.15,48,282 కోట్లు.. రెవెన్యూ లోటు రూ.5,23,846 కోట్లుగా ఉంది.. నికర రెవెన్యూ లోటు రూ.96,654 కోట్లు.. ద్రవ్య లోటు రూ.15,68,936 కోట్లు.. ప్రాథమిక లోటు రూ.2,92,598 కోట్లుగా ఉంది బడ్జెట్.