గిగ్ వర్కర్లకు కేంద్రం తీపికబురు చెప్పింది. గిగ్ వర్కర్ల గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. వారికి గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ-శ్రమ్ పోర్టల్ కింద వీరి వివరాలు నమోదు చేస్తున్నట్లు వివరించారు. ఈ నిర్ణయంతో కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.