అదృష్టం కలిసి రావడం అంటే ఇదేనేమో. ఓ జాలరీపై దేవుడు కరుణ చూపించడంతో ఒక్కరోజులోనే లక్షాధికారిగా మారాడు మత్స్యకారి. రెండు మూడు సార్లు చేపల వేటకు వెళ్తే కలిసిరాని అదృష్టం ఒక్క రోజులోనే కలిసి వచ్చింది. దీంతో అతని పంట పండింది. అతను రోజూ పూజించే గంగమ్మ ఒక్కసారిగా జాలరీపై అమితమైన ప్రేమ కురిపించింది. దీంతో ఆయన పంట పండింది. వివరాల్లోకి వెళ్తే... కాకినాడలోని సముద్రతీరంలో చేపల వేటకు మత్స్యకారి వెళ్లాడు. ఆయన వేట కొనసాగించే క్రమంలో అతనికి అదృష్టంలా ఓ చేప కలిసి వచ్చింది. జాలరీ వలలో అత్యంత అరుదైన కచిడి చేప పడింది. చేప దొరికిందే అనువుగా ఆ చేపను తీసుకెళ్లి కుంభాభిషేకం రేవులో వేలం పెట్టాడు.
కచిడి చేప ఏకంగా రూ. 3లక్షల 95వేల ధర పలికింది. ఈ చేప మాంసం ఎంతో రుచిగా ఉంటుంది. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని కొనడానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కచిడి చేపకు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ చేపలో. అలాగే వైద్యులు ఏదైనా చికిత్స చేసిన తర్వాత కుట్లు వేసే దారాన్ని కూడా దీని నుంచే సేకరిస్తారు. ఈ చేప పొట్టభాగం నుంచి తయారుచేసే దారం ఆ తర్వాత శరీరంలో క్రమంగా కలిసి పోతుంది. ఖరీదైన వైన్ తయారీలోనూ ఈ చేపను ఉపయోగిస్తారు. అందుకే ఈ కచిడి చేపకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.