శ్రీలంక క్రికెటర్ దిముత్ కరుణరత్నే(36) ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఈనెల 6 నుంచి AUSతో జరిగే రెండో టెస్ట్ మ్యాచే తనకు చివరిదని తెలిపారు. SL తరపున అతడు 99 టెస్టుల్లో 7,172 పరుగులు, 50 ODIల్లో 1,316 రన్స్ చేశారు. టెస్టుల్లో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించారు. 30 టెస్టులకు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. ఇటీవల ఫామ్ కోల్పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.