నూజివీడు మునిసిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు పది మంది పసుపు కండువా కప్పుకోవడంతో వైస్ చైర్మన్ పదవి టీడీపీ వశమైంది. మున్సిపల్ సమావేశ మందిరంలో సోమవారం వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. 32 మందికి కౌన్సిల్ సభ్యులకు తవిడిశెట్టి వెంకటలక్ష్మి మినహా 31 మంది హాజ రయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యునిగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. తొలుత వైసీపీ కౌన్సిలర్ నవుడు నాగమల్లేశ్వర రావును ఆ పార్టీ కౌన్సిలర్లు శీలం రామయ్య రావు ప్రతిపాదించగా, షేక్ అమీరున్నీసా బేగం బలపర్చారు. మూజువాణి ఓటు విధానంలో నాగమల్లేశ్వరరావును 14 మంది కౌన్సిలర్లు బల పరుస్తూ చేతులెత్తారు. అయితే 13 మందే సం తకాలు చేశారు.
11వ వార్డు కౌన్సిలర్ గాదిరెడ్డి శ్రీలతారెడ్డి సంతకం చేయకపోవడం గమనార్హం.అనంతరం తాజా మాజీ వైస్ చైర్మన్, ఐదో వార్డు వైసీపీ కౌన్సిలర్ పగడాల సత్యనారాయణ పసుపు కండువా కప్పుకుని టీడీపీ తరపున వైస్ చైర్మన్‌గా పోటీ చేశారు. ఆయనను కౌన్సిల ర్లు మల్లిశెట్టి ప్రియదర్శిని ప్రతిపాదించగా, కందుల సత్యనారాయణ బలపరిచారు. పగడాలను మంత్రి పార్థసారథితో కలిసి 18 మంది సమ ర్ధిస్తూ సంతకాలు చేశారు. వైస్ చైర్మన్‌గా పగ డాల ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి, నూజి వీడు సబ్ కలెక్టర్ స్మరణ్‌రాజ్ ప్రకటించి, ఎన్నిక పత్రాన్ని అందించారు.