AP: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాల దందా కేసులో అధికారులు ఇద్దరు పర్మినెంట్ ఆలయ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు ఐదుగురిపై వేటు పడగా, మరింత మందిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దళారి ఫోన్ నుంచి భారీఎత్తున నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ఆలయ సిబ్బంది ప్రమేయంతోనే దందా జరిగినట్లు నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు.
![]() |
![]() |