ఫిబ్రవరి 27న జరగబోవు పట్టభద్రుల ఎన్నికల్లో అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాయని బుధవారం గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో పౌర సరఫరా శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రి మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో అన్ని సంస్థల్లోనూ ఓటర్లను కలిసి ఓటువేసే విధంగా కూటమి నాయకులు పనిచేస్తున్నారు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో కలిపి భారీ బహిరంగ సభను నిర్వహించాలని, తప్పనిసరిగా ప్రతిఒక్కరూ ఆలపాటి రాజాను గెలిపించాలని కోరారు.