ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు పర్యాటకుల తాకిడి పెరిగింది. అయోధ్యలోని బాలరాముడి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ఎక్కువైంది. రోజు రోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అయోధ్య రామమందిర ట్రస్ట్ రాములవారి దర్శన వేళలను గంటన్నర పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే సాధారణ దర్శనాన్ని ఇకపై గంట ముందుగా అంటే ఉదయం 6 గంటల నుంచే కల్పిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. రాత్రి 9.30 గంటలవరకు ఉన్న దర్శన వేళలను 10 గంటలవరకూ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.బాలరాముడి ఆలయంలో ఫిబ్రవరి 6 నుండి మారిన వేళలు అందుబాటులోకి వచ్చాయి. భక్తులు ఇప్పుడు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు బాలరాముడిని దర్శించుకునే అవకాశం దక్కింది. జనవరి 14 నుండి ఫిబ్రవరి 3, బసంత్ పంచమి వరకు ఆలయానికి 50 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టుగా తెలిసింది.ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా సందర్భంగా అయోధ్యకు వచ్చే భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని, ఆలయ ట్రస్ట్ జనవరి 26 నుండి ఉదయం 5 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు దర్శనాలను అనుమతించింది. ఫిబ్రవరి 6 నుండి రోజువారీ దర్శన క్రమం మారుతుంది అని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా అన్నారు.
![]() |
![]() |