సుమధుర కళా నికేతన్ హాస్య నాటికల పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా మల్లాది క్రియేషన్స్ (హైదరాబాద్) వారి ఆవేశంలో ఆనందం బహుమతి అందుకుంది. ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తూ మూడు రోజుల పాటు విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో జరిగిన నాటికల పోటీల్లో విజేతలుగా ఈవీఎస్ కళాసమితి(విజయవాడ) వారి దంత వేదాంతం ద్వితీయ, భద్రం ఫౌండేషన్ వెల్ఫేర్ సొసైటీ (విశాఖపట్నం) వారి దొందూ దొందే నాటిక తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నిలిచాయి.
మద్దుకూరి ఆర్ట్ క్రియేషన్స్ (చిలకలూరిపేట) వారి మా ఇంట్లో మహాభారతం, సహృదయ, ద్రోణాదుల వారి వర్క్‌ఫ్రం హోమ్ నాటికలు ప్రత్యేక జూరీ బహుమతులు పొందాయి. ఉత్తమ దర్శకుడుగా వాసుదేవ రావు (ప్రేమపిచ్చి), ఉత్తమ రచయితగా మల్లాది రవికిరణ్ (ఆవేశంలో ఆనందం), ఉత్తమ నటిగా లహరి (వర్క్ ఫ్రం హోమ్), ఉత్తమ నటుడిగా ఎ.అర్జున్ (ఆవేశం లో ఆనందం), ప్రోత్సాహక బహుమతులు పి.రమేష్‌బాబు (దంత వేదాంతం), కె.కుమారి (దొందూ దొందే), ఉత్తమ ఆహార్యం పి.శ్రీధర్ (మా ఇంట్లో మహాభారతం), ఉత్తమ సంగీతం సురభి ఎం.నాగరాజు (దంత వేదాంతం) బహుమతులు అందుకున్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఎస్కే మిశ్రో, సుబ్బరా యశర్మ, కోట శంకరరావు వ్యవహరించారు. అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, డి.రామకోటేశ్వరరావు, కోనేటి సుబ్బరాజు (రంగస్థల నటులు), పి.మురళీకృష్ణ (జాషువా సాంస్కృతిక వేదిక), రావి వెంకటరావు (ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), సామంతపూడి నరసరాజు (సుమధుర అధ్యక్షులు), పీవీ భాస్కరశర్మ (ప్రధాన కార్యదర్శి), డాక్టర్ ఎంసీ దాస్, డి.కైలాసరావు, పి.సూర్యనారాయణమూర్తి తదితరులు కళాకారులకు బహుమతులు అందించి అభినందించారు.
![]() |
![]() |