వీఐపీల భద్రత కోసం 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలు చేయాలని ఏపీ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 10 టయోటా ఫార్చునర్ వాహనాలు కొనుగోలు చేసి వాటిని బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఏపీలోని కొందరు ముఖ్యులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వీఐపీలకు రక్షణగా ఈ వాహనాలు అందించనున్నారు. ఇందుకోసం రూ.9.20 కోట్లు వెచ్చించాలని పేర్కొంటూ హోంశాఖ ఆదేశాలు జారీచేసింది.