గిద్దలూరులోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంగళవారం వన్యప్రాణి మాంసం కలిగి ఉన్న ఓ వ్యక్తిని స్థానిక సీఐ సురేష్ గుర్తించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద 7 కేజీలకు పైగా మాంసం ఉన్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కణితి మాంసం అయ్యి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
![]() |
![]() |