మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో భారీ లిక్కర్ స్కాం చోటుచేసుకుందని అన్నారు. జగన్ హయాంలో లిక్కర్ స్కాంపై త్వరలోనే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయిస్తుంటే జగన్ ఓర్వలేక కోర్టుకు వెళ్లారని విమర్శించారు. మద్యంలో దోపిడీ చేస్తున్నారంటూ తమపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ నాసిరకం మద్యం ఇస్తే, తాము అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం ఇస్తున్నామని, మంచి బ్రాండ్లు అందుబాటులోకి తీసుకువచ్చామని కొల్లు రవీంద్ర వివరించారు. మద్యం నాణ్యతలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. బెల్టు షాపులు నడిపిన చరిత్ర జగన్ ది అని వ్యాఖ్యానించారు.
![]() |
![]() |