వన్‌ప్లస్ రెడ్ రష్ డేస్ సేల్ పేరుతో ప్రత్యేక సేల్ ను ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. ఈ సేల్ ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 16 వ తేదీ వరకు కొనసాగుతుంది. వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారికి ఈ సేల్ ఉపయోగపడుతుంది. దీంతోపాటు బ్యాంకు డిస్కౌంట్ ల ద్వారా మరింత డిస్కౌంట్ ను పొందవచ్చు. అయితే ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌ల పైనా డిస్కౌంట్‌లను పొందవచ్చు.
భారత్ మార్కెట్ లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ ను కూడా డిస్కౌంట్ ధరలకు సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే విధంగా 13R వేరియంట్ పై రూ.3000 తగ్గింపును పొందవచ్చు.
![]() |
![]() |