బుక్కరాయసముద్రం పరిధిలోని కొండమీదరాయుడు స్వామి బ్రహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, వారి కుటుంబ సభ్యులు బండారు రవికుమార్, బండారు లీలావతి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బుధవారం వేకుజామున జరిగే స్వా మి వారి కళ్యాణోత్సవం కోసం వాటిని సమర్పించారు. నియోజకవర్గం ప్రజలు, రైతులు ఈ ఏడాది సుఖసంతోషాలుతో ఉండాలని స్వామి వారిని మొక్కుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకుడు పసుపుల శ్రీరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |