సాదరంగా, ప్రేమ పూర్వకంగా వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలోకి తనను ఆహ్వానించిన అందరికి ధన్యవాదాలు అంటూ మాజీ మంత్రి శైలజానాథ్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఎదురించడానికే వైఎస్సార్సీపీలో చేరినట్లు చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి, ఆ కుటుంబం అంటే తనకు ఆరాధన భావం ఉందని.. అన్న, చెల్లెల్ల మధ్య జరుగుతున్న వివాదం ముగిసిపోవాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని,, యాత్రల పేరుతో డిప్యూటీ సీఎం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని శైలజానాథ్ అన్నారు. సూపర్ సిక్స్ హామీలను చూసి ప్రజలు ఎన్డీయేకు అధికారం ఇచ్చారని, హామీలు ఇచ్చేటప్పుడు సీఎం చంద్రబాబుకు తెలియదా.. అని ప్రశ్నించారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం ఇవ్వడానికి చంద్రబాబు మనసుకు కష్టంగా ఉంటుందని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, క్షమాపణలు చెబితే సరిపోదని అన్నారు. ఏపీలో శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.
![]() |
![]() |