ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ పాల కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 05:59 PM

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్ పాల్ కు బెయిల్ లభించింది. విజయ్ పాల్ ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను ఈ కేసు ఎఫ్ఐఆర్ లో ఏ4 నిందితుడిగా పేర్కొన్నారు. ఆయనకు గుంటూరు స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఈ ఉదయం గుంటూరు కోర్టుకు రఘురామకృష్ణరాజు వచ్చారు. కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన ఓ అంశంపై కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com