శ్రీకాకుళం జిల్లా, పలాస మండలంలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన వరిశ భాస్కరరావు కొద్ది నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబర్చుకున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. వివాహానికి భాస్కరరావు అంగీకరించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు రెండు రోజుల కిందట పలాస పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి పలాస మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయాధికారి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. భాస్కరరావును పాతపట్నం సబ్‌జైలుకు తరలించినట్లు సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు.
![]() |
![]() |