ఆగిపోయిన ఓ పెళ్లికి సంబంధించిన కారణం వింటే మాత్రం ప్రతీ ఒక్కరు ముక్కున వేలేసుకుంటారు. యువతీ యువకుడికి పెళ్లి నిశ్చయం కాగా.. పెళ్లిలో పెట్టే కానుకలను.. వధువు తండ్రి పెళ్లికి ఇంకా 10 రోజుల సమయం ఉండగానే.. వరుడి ఇంటికి పంపించారు. అయితే అవి చూసిన వరుడు.. వధువు వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు ఆ కానుకలు నచ్చలేదని పేర్కొన్నాడు. దీంతో ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు వధువు కుటుంబం తెగేసి చెప్పడంతో ఆ పెళ్లి ఆగిపోయింది.
ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి.. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఓ యువతిని చూసి పెళ్లి నిశ్చయం చేశారు. ఆ యువతి అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా.. ఆ వ్యక్తి యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లికి ముందే పెళ్లిలో పెట్టే కానుకలను కాబోయే మామ.. వరుడి ఇంటికి పంపించారు.
అయితే ఆ కానుకలను చూసిన వరుడు.. అవి తనకు నచ్చలేదంటూ వధువుతో చెప్పాడు. దీంతో ఆ విషయాన్ని వధువు తన కుటుంబ సభ్యులకు చెప్పింది. పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్లి తర్వాత వరుడు ఎలా ఉంటాడో అని భయపడిన వధువు కుటుంబం ఆ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు చెప్పింది.
ఈ సందర్భంగా వధువు, వరుడు మధ్య జరిగిన వాట్సాప్ చాట్లను వధువు బంధువు రెడ్డిట్లో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు వరుడు చేసిన పనికి తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. అదే సమయంలో వధువు కుటుంబం చేసిన పనికి మెచ్చుకుంటున్నారు.
యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వరుడికి.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వధువు మధ్య జరిగిన చాటింగ్ కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తనకు పంపించిన గిఫ్ట్లు నచ్చలేదని.. వధువుకు చెప్పాడు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది. విషయం కాస్తా కుటుంబ సభ్యులకు చెప్పడంతో వరుడి తీరు నచ్చక వారు పెళ్లిని రద్దు చేశారు.
![]() |
![]() |