విజయవాడ నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సితార సెంటర్ వద్ద కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎగ్జిబిషన్‌లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసి పడ్డాయి. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో నివశిస్తున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అగ్ని ప్రమాదం తాలూకు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే మంటలు ఎగసిపడటానికి షార్ట్ సర్క్యూట్ కారణమని కొంతమంది, సిలిండర్ పేలుడు కారణమని మరికొంతమంది భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంది.
![]() |
![]() |