నేరమయ రాజకీయాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు వైసీపీకి చెంపపెట్టు అని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. హత్యా రాజకీయాల పునాదులపై వైసీపీని జగన్ నిర్మించారని ఆరోపించారు. అవినీతి, విద్వేషమనే కవచాలతో వైసీపీని కాపాడుకుంటున్నారని చెప్పారు. క్రిమినల్ కేసులున్న వారు పాలకులయితే జరిగే నష్ట ప్రభావం రాష్టం గత ఐదేళ్లు చవిచూసిందని అన్నారు. హత్యలు చేసి దర్జాగా పాలన సాగించి, తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు నిస్సిగ్గుగా ఎదుటివారిపై బురదజల్లారని మండిపడ్డారు. అబద్దాలు, మోసాలతో ప్రజల్ని వంచించి రాష్ట్రాన్ని దోచేసి అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. సమాజంలో ఉండటానికే పనికిరాని వారిని అందలం ఎక్కిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందో ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
![]() |
![]() |