అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ 85 ఏళ్ల వయస్సులో బుధవారం లక్నోలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ నెల ప్రారంభంలో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆయన పరిస్థితి విషమించడంతో సత్యేంద్రని లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్చారు. ఈ క్రమంలోనే వైద్యుల పర్యవేక్షణ తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే హై డిపెండెన్సీ యూనిట్ లో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.
![]() |
![]() |