రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే నంద్యాల జిల్లా కేంద్రంలోని PSC & KVSC Govt Degree Collegeలో ఈ నెల 14వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పనా అధికారులు తెలిపారు. ఈ మినీ జాబ్ మేళాలో Agrisol India Pvt Ltd, Vikasa, Bharat Financial Inclusion Ltd, Enovizon Integrated Facility Management Services Pvt Ltd, వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి. దీనికోసం పదవ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, వంటి ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు.
![]() |
![]() |