జగదేవపూర్ మండలంలో అలీరాజపేట్ విన్సెంట్ హై స్కూల్ విద్యార్థినిలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీ టీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీ టీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీ టీమ్స్, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు, గుడ్ టచ్ బాడ్ టచ్ తదితర అంశాల గురించి జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్ గజ్వేల్ షీటీమ్ బృందం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన చట్టాల గురించి, మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుందని తెలిపారు.
మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం మహిళల భద్రత మా ముఖ్య బాద్యత. చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు. మహిళలను పిల్లలను ఎవరైనా అవహేళన చేసిన ఇబ్బంది పెట్టిన మౌనం వీడి డయల్ 100 కు లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ షీటీమ్ నెంబర్ 8712667343 కాల్ చేసి తెలుపాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ బిందు మాచర్ల, ఉపాధ్యాయులు గజ్వెల్ షీటీమ్ బృందం శ్రీరాములు ఏఎస్ఐ, కానిస్టేబుల్ మహేష్, తదితరులు పాల్గొన్నారు...
![]() |
![]() |