ఎదుగుతున్న పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరమని డ్రాగన్ స్వార్డ్స్ కుంగ్ ఫూ అకాడమీ అధ్యక్షులు బొడ్డు రాజమల్లు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన కుంగ్ ఫు, కరాటే రాష్ట్రస్థాయి పోటీలలో డ్రాగన్ స్వార్డ్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు కటాస్ భాగంలో రాజ్ కుమార్, అనాస్, అస్తోస్, కె.మణిదీప్, శివకుమార్, ఐషిక, అనిరుద్ గోల్డ్ మెడల్స్, జి. మణిదీప్, రామ్ చరణ్, రుద్రతేజ్, వీరు సిల్వర్ మెడల్స్, రిషిత్ వర్మ బ్రాస్ మెడల్, వెపన్స్ భాగంలో స్నిగ్ధ, రాజ్దీప్ సింగ్ గోల్డ్ మెడల్స్ సాధించారు. వీరిని అయన అభినందించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మారిన మానవ జీవన విధానంలో శారీరక, మానసిక దృఢత్వం ఎంతో అవసరమన్నారు. తద్వారా క్రమశిక్షణ అలవడి మంచి పౌరులుగా ఎదుగుతారన్నారు. ఆత్మ రక్షణ విద్యలు మానసిక స్థైర్యాన్ని పెంపొదిస్తాయన్నారు. పట్టణంలో కరాటే కుంగ్ ఫూ నేర్చుకోవాలంటే 9866906150 నెంబరును సంప్రదించలన్నారు.
![]() |
![]() |