బరువు తగ్గాలని ట్రై చేసినా, వర్కౌట్, డైటింగ్ చేసిన కొంతమందికి అసలే రిజల్ట్ ఉండదు. దీనికి రకరకాల కారణాలున్నప్పటికీ హార్మోన్స్ ఇన్‌బ్యాలన్స్ కూడా ఓ కారణమే. ఇవి బరువు తగ్గడంలో కీ రోల్ పోషిస్తాయి. జీవక్రియ, ఆకలి, కొవ్వు నిల్వలని కంట్రోల్ చేసే ఈ ఆర్మోన్స్ కారణంగానే ఊబకాయం పెరుగుతారు. ఉన్న బరువు తగ్గరు. అంతేనా, బీపి, షుగర్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు కూడా వస్తాయి. వాటన్నింటికీ దూరంగా ఉండాలంటే కచ్చితంగా బరువు తగ్గించుకోవాలి. అంటే హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్.. ఏ హార్మోన్స్ కారణంగా బరువు తగ్గట్లేదో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా బరువు తగ్గించకుండా పెంచే హార్మోన్స్ గురించి ఇప్పుడు తెలుసుకోండి.
కార్టిసాల్
కార్టిసాల్ అనేది కూడా స్టెరాయిడ్ హార్మోన్. దీనిని ఒత్తిడి హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఒత్తిడి కారణంగా బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. అలాంటి ఒత్తిడిని కంట్రోల్ చేయడానిక యోగా, ధ్యానం, మెడిటేషన్, వాకింగ్ వంటివి చేయండి. అలానే నిద్ర కూడా చాలా ముఖ్యం. హాయిగా నిద్రపోండి. దీంతో ఒత్తిడి, నిరాశ, డిప్రెషన్ వంటివి తగ్గుతాయి. దీంతో, బరువు తగ్గడానికి కూడా వీలవుతుంది.
లెప్టిన్
లెప్టిన్ అనేది మీ ఆకలిని కంట్రోల్ చేసి బరువుని బ్యాలెన్స్ చేయడంలో సాయపడే హార్మోన్స్. దీనిని Satiety Hormone అని కూడా అంటారు. ఈ హార్మోన్ పనిచేయడం ఆగిపోవడం కారణంగా అతిగా తింటారు.
ఏం చేయాలంటే.. లెప్టిన్ స్థాయిలను రీసెట్ చేయడానికి ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌ని కంట్రోల్ చేయండి. మంచి నిద్ర ఉండేలా చూసుకోండి.
ఇన్సులిన్
ఇన్సులిన్ అనేది బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేసే హార్మోన్. ఇన్సులిన్ సాయంతో శరీరంలో కొవ్వు కూడా నిల్వ చేయబడుతుంది. అదనపు చక్కెర, కార్బోహైడ్రేట్స్ నుండి ఎక్కువగా ఇన్సులిన్ కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుందని ఫిట్‌నెస్ కోచ్ చెబుతున్నారు.
దీనిని సాల్వ్ చేసేందుకు లో గ్లైసెమిక్ ఫుడ్స్ తీసుకోవాలి. తక్కువ పరిమాణంలో తినాలి. అదే విధంగా, కొన్ని సమయాల్లోనే తినాలని గుర్తుంచుకోండి.
థైరాయిడ్
థైరాయిడ్ హార్మోన్ కూడా జీవక్రియని తగ్గిస్తుంది. దీని కారణంగానే కేలరీలు బర్న్ చేయడం కష్టంగా మారుతుంది. ఈ కారణంగా విపరీతమైన బరువు పెరుగుతారు.
ఏం చేయాలంటే దీనికోసం ఆహారంలో అయోడిన్ రిచ్ ఫుడ్స్, సెలీనియం అంటే నట్స్‌ని తీసుకోండి. డాక్టర్‌ని సంప్రదించండి.
ముందుగా
అసలు మనం ఎంత ట్రై చేసినా బరువు ఎందుకు తగ్గట్లేదని కనుక్కోవాలి. దీనికోసం డాక్టర్‌ని కలిసి సలహా తీసుకుంటే ఆయన మీకు అవసరమైన టెస్టులన్నింటినీ చేస్తారు. ఆ టెస్టుల్లో వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా మీరు సమస్య లేకుండా ఏం చేయాలో సూచిస్తారు. ఆ ప్రకారమే డైట్, మెడిసిన్ తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.
![]() |
![]() |