రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నూతన కెప్టెన్ రజత్ పాటిదార్ క్రేజ్ మామూలుగా లేదు. సీనియర్లు ఉన్నప్పటికీ వారందర్నీ పక్కనబెట్టి మరీ ఆర్సీబీ మేనేజ్‌మెంట్ పాటిదార్‌కు పట్టం కట్టింది. అందని ద్రాక్షాలాగే మిగిలిపోయిన ఐపీఎల్ కప్ ఈ ఏడాదైనా సొంతం అవుతుందనే ఆశలో ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ 18వ ఎడిషన్ కావడం, కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18 కావడంతో ఈ ఏడాది ఆర్సీబీ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చిన్న వయస్సులోనే కెప్టెన్ అయిన రజత్ ఇప్పుడు టీమిండియా కెప్టెన్లందరికీ బాప్‌గా మారాడు.
టీమిండియా టెస్టు కెప్టెన్లుగా రోహిత్ శర్మ, బుమ్రా వ్యవహరిస్తున్నారు. వన్డే కెప్టెన్‌గా రోహిత్, టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. అయితే ఈ ముగ్గురు కూడా ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడుతున్నారు. హార్దిక్ పాండ్యానేమో డొమెస్టిక్ క్రికెట్‌లో కృనాల్ పాండ్యా కెప్టెన్సీలో ప్లేయర్‌గా ఆడుతున్నాడు. ఇప్పుడు అదే కృనాల్ పాండ్యా రజత్ పాటిదార్ సారథ్యంలో ఆడనున్నాడు. దాంతో టీమిండియా తరఫున ఉన్న అందరి కెప్టెన్లు రజత్ పాటిదార్ కిందే కదా. ఈ మెసెజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ సాలా కప్ నమ్దే అని ఫిక్స్ అయిపోయారు.
31 సంవత్సరాల రజత్ పాటిదార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నూతన కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రజత్ డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు మూడు టెస్టులు, ఒక వన్డే ఆడాడు.
ఐపీఎల్‌లో 2021లో అడుగుపెట్టిన రజత్.. ఆర్సీబీతోనే తన ప్రస్థానం మొదలుపెట్టాడు. ఐపీఎల్ 2021లో ఆర్సీబీకి సైన్ చేసిన పాటిదార్ కేవలం నాలుగు మ్యాచ్‌లలోనే ఆడాడు. ఐపీఎల్ 2022లో తన బ్యాటింగ్ రుచి చూయించిన పాటిదార్ హైయెస్ట్ స్కోర్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 112 పరుగులు చేశాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2023కి దూరమయ్యాడు.
ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటి వరకు కేవలం 27 మ్యాచ్‌లే ఆడిన రజత్ పాటిదార్ 799 పరుగులు చేశాడు. ఏడు హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ కూడా నమోదు చేశాడు. అతి తక్కువ కాలంలోనే కెప్టెన్‌గా ఎదిగిన రజత్‌కు తమ సపోర్ట్ కచ్చితంగా ఉంటుందని విరాట్ కోహ్లితో పాటు ఆర్సీబీ ప్లేయర్లంతా చెప్పారు.
![]() |
![]() |