భారత్‌లో తనకు చాలా గొప్ప స్వాగతం లభించిందని, తన హృదయంలో ఈ దేశానికి ప్రత్యేక స్థానం ఉంటుందని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా చెప్పారు. భారత సంస్కృతి, కళలు చాలా గొప్పగా ఉన్నాయన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భావన ఎంతో గొప్పదని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... "ఎన్నో భాషలు ఉన్నా అందరూ ఐక్యంగా ఉండటం భారత్ స్ఫూర్తి. ఈ స్ఫూర్తి నాకు చాలా బాగా నచ్చింది. నా హృదయానికి దగ్గరైంది. మిస్ వరల్డ్ కూడా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక" అని క్రిస్టినా అన్నారు. కాగా, ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. మే నెలలో హైదరాబాద్ వేదికగా పోటీలు ప్రారంభం కానున్నాయి.
![]() |
![]() |