విజయవాడ ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల్లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ధుర్యోధన ఏకపాత్రాభినయం చేసి అందరిని అలరించారు. ఆచార్య దేవా... ఏమంటివి, ఏమంటివి అంటూ సుదీర్ఘమైన డైలాగులను తనదైన శైలిలో పలికి రంజింపజేశారు. స్టేజిపై రఘురామ ప్రదర్శనను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి నారా లోకేశ్, ఇతర ఎమ్మెల్యేలు ఎంతగానో ఆస్వాదించారు. ప్రదర్శన అయిపోయాక లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టి ఆయనను అభినందించారు.
![]() |
![]() |