తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు దర్శిస్తారు. ఈ క్రమంలో, వారు భక్తితో స్వామిని సందర్శించి, మొక్కులు చెల్లించుకుంటారు. తాజాగా టీటీడీ కీలక ప్రకటన చేసింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 25న కోయిల్‌ఆళ్వార్ తిరుమంజనం, 30వ తేదీన ఉగాది పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
![]() |
![]() |