ఉగాది రోజున మూడో విడత నామినేటెడ్ పదవుల జాబితా విడుదల చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. 50 నుంచి 60 ఏఎంసీలు జాబితా తుది కసరత్తు చేస్తోంది. త్వరలో 60 కీలక కార్పొరేషన్లు, 21 ఆలయ కమిటీల నియామకాలు చేపట్టనుంది. మహానాడు కల్ల అన్ని పదవులు భర్తీ చేయనుంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి పెద్ద సంఖ్యల ఆశావాహులు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానానికి 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కాగా జనసేన, బీజేపీలు మరిన్ని పోస్టులు అడుగుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఒక్క టీడీపీ నుంచే 60వేల పైచిలుకు దరఖాస్తులు అందాయి. పార్టీలో ఏ స్థాయిలో ఉన్నవారైనా కుటుంబ సాధికార సారథి (కేఎస్ఎస్) బాధ్యత చేపట్టాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో ఆశావహులు చాలామంది ఇప్పటికే ఆ బాధ్యతలు చేపట్టారు. నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, గన్ని వీరాంజనేయులు, పరసా రత్నం, దారపనేని నరేంద్ర, కనపర్తి శ్రీనివాసరావు, నాదెండ్ల బ్రహ్మం, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు. ప్రభాకర్ చౌదరి, గన్ని వీరాంజనేయులు సీట్ల సర్దుబాటులో టికెట్లు కోల్పోయారు. దారపనేని నరేంద్ర వైసీపీ హయాంలో అక్రమ కేసుల బాధితుడు. వీరితోపాటు ఇటీవల ఎమ్మెల్సీ ఆశించి నిరాశపడినవారు కూడా కీలకమైన నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నారు.
![]() |
![]() |