ఆంధ్రప్రదేశ్‌లు అప్పులు 2025 మార్చి 31 నాటికి రూ.5,62,557 కోట్లు అని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఏపీ అప్పులు స్థూల దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ)లో 34.7 శాతం కాగా, తెలంగాణ అప్పులు రూ.4,42,298 కోట్లతో జీఎ్‌సడీపీలో 26.2శాతం అని ఆయన సోమవారం లోక్‌సభలో తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. కాగా, విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈక్విటీ పెట్టుబడి కల్పనలో భాగంగా ఎలాంటి ప్రైవేటురంగ భాగస్వామ్యాన్ని తీసుకోవడం లేదని కేంద్రం తెలిపింది. ఈ కర్మాగారానికి రూ.11,440 కోట్ల మేరకు కేంద్రం ఈక్విటీ మూలధనాన్ని సమాకూర్చినట్లు కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు.
![]() |
![]() |