ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. గ్రామాల్లో ఒంటరిగా నివాసముంటున్న వయోవృద్ధుల వివరాలను పోలీసుశాఖ సేకరించి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించింది.
వయోవృద్ధులందరికీ డిజిటల్ కార్డులు అందిస్తామని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. వృద్ధులపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా 12 వృద్ధాశ్రమాల్ని నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు.
![]() |
![]() |