ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అనారోగ్య పరిస్థి తులలో సతమతమవుతున్న పేద ప్రజలకు ముఖ్య మంత్రి సహాయనిధి ఒక భరోసా ఇస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం గిద్దలూరు నియోజకవర్గంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 37 మందికి సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ. 23,89,836లను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మంజూరు చేయించి ఆ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తే తనకు తెలియచేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కొమరోలు, రాచర్ల, గిద్దలూరు మండల పార్టీల అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు, కటికె యోగానంద్, మార్తాల సుబ్బారెడ్డి, కేతం శ్రీనివాసులు, నరసింహులు, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |