శనగ రైతులను ఆదుకునే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌యార్డుల ద్వారా శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిలో భాగంగా కంభం మార్కెట్‌యార్డు ఆవరణలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కంభం, అర్ధవీడు మండలాలకు చెందిన రైతుల నుంచి కందులు, శనగలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. క్వింటా శనగలు రూ.5650, క్వింటా కందులు రూ.7650 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కావున శనగ, కందులు రైతులు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ ఏడీఏ బాలాజీ నాయక్, ఏవో స్వరూపా, ఎంపీడీవో వీరభద్రాచారి, తహసీల్దార్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |