చెత్త నుంచి సంపద సృష్టించే భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని అన్ని పంచాయతీలలో ఘనవ్యర్థ పదార్థాల నుంచి ఎరువులను విద్యుత్ ఉత్పత్తి చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఒక్కో మండలం చొప్పున ఆయా పంచా యతీల కార్యదర్శులు, క్లాప్‌మిత్రల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో వీరభద్రాచారి, జడ్పీటీసీ సభ్యులు కొత్తపల్లి జ్యోతి కంభం, కందులాపురం సర్పంచులు బోడయ్య, రజని, టీడీపీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాసులు, ఆరేపల్లి మల్లికార్జున, ఎస్సీసెల్ నాయకులు గోన చెన్నకేశవ రావు, కేతం శ్రీనివాసులు, ఈవోపీఆర్‌డీ విజయలక్ష్మి, నీటిసంఘం అధ్యక్షులు ఆదినారాయణ, బిజ్జాల కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |