భారత రాజ్యాంగం ప్రతీ పౌరుడికి తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించే స్వేచ్ఛ (ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్) ఇచ్చిందని, అయితే దానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే పేర్కొన్నారు. దేనికైనా సరే ఒక హద్దు ఉంటుందని, ఆ హద్దు మీరితే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. స్టాండప్ కమేడియన్ కునాల్ కామ్రా తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై షిండే స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విమర్శలు, సెటైర్లను తాను కూడా ప్రోత్సహిస్తానని చెప్పారు. విమర్శలైనా, సెటైర్లకైనా ఓ పద్దతంటూ ఉండాలని, ఇష్టానుసారం మాట్లాడటం పద్దతికాదన్నారు. తనపై సెటైర్లు వేయడానికి కామ్రా సుపారీ తీసుకున్నట్లు ఉందని షిండే ఆరోపించారు. కాగా, ముంబైలోని ఓ హోటల్ లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఏక్ నాథ్ షిండేను ద్రోహి అనడంపై శివసేన (షిండే వర్గం) కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. సదరు హోటల్ పై దాడిచేసి విధ్వంసం సృష్టించారు. ఫర్నిచర్, కిటికీలు, మైక్ లు, సీలింగ్ ను ధ్వంసం చేశారు.
![]() |
![]() |