నాయనమ్మతో వచ్చి తప్పిపోయిన చిన్నారి ఆచూకీ డ్రోన్ సాయంతో పోలీసులు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చిన్నగొల్లపాలెంకు చెందిన బొర్రా వెంకట నారాయణమ్మ తన మనుమడు, మనుమరాలితో ఆధార్ కార్డు అప్‌డేట్ కోసం భీమవరం హెడ్ పోస్టాఫీ్‌సకు వెళ్లారు. మంచినీళ్ల కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఏడేళ్ల మనుమరాలు దివ్య కనిపించకపోవడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. టౌన్ సీఐ నాగరాజు, ఎస్‌ఐ కిరణ్ కుమార్ తక్షణమే స్పందించి తమ సిబ్బందితో కలసి గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో డ్రోన్ ద్వారా సమీపంలోనే చిన్నారి ఉన్నట్టు గుర్తించి ఆమెను సురక్షితంగా నారాయణమ్మకు అప్పగించారు.
![]() |
![]() |