అడుగులన్నీ మల్లన్న సన్నిధికే. ఆశలన్నీ తల్లి భ్రమరాంబవారిపైనే. అమ్మవారిని తమ ఆడబిడ్డగా భావించి సేవించే కన్నడిగులు కర్ణాటక ప్రాంతం నుంచి శ్రీశైలానికి తరలివస్తున్నారు. దీంతో శ్రీగిరి సందడిగా మారింది. శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27న స్వామివారి యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు.. 31న ముగుస్తాయి.కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం నాటికే వేలాది మంది స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారంతో స్పర్శ దర్శనం నిలిపివేసి.. గురువారం నుంచి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించనున్నారు.
![]() |
![]() |