రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే కూటమి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలని, లేనిపక్షంగా వైయస్‌ఆర్‌సీపీ నుంచి రైతు పోరును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయన మాట్లాడుతూ.... తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడినా రైతులకు కడగండ్లు తప్పడం లేదు. కరువు, లేదంటే అతివృష్టి, గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి పరిణామాలను రైతులు చవిచూస్తున్నారు. దీనికి తగట్టుగా మొదటి నుంచి చంద్రబాబుకు వ్యవసాయం అంటే చిన్నచూపు, వ్యవసాయం దండుగ అన్న భావనే ఉంది. దానికి అద్దం పట్టేలా తాజాగా రాష్ట్రంలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక ధర్నాలు చేస్తున్నారు. కొనేవారు లేక మిర్చి యార్డుల్లో లక్షల బస్తాల మిర్చీ నిల్వలు పెరుకుపోతున్నాయి. ఇటీవల వైయస్ జగన్ గారు గుంటూరు మిర్చి మార్కెట్‌ను సందర్శించి, వారికి అండగా మాట్లాడారు. వెంటనే సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్రం ద్వారా కొనుగోళ్ళు చేయిస్తానని ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తరుఫున ఒక్క బస్తా అయినా కొనుగోలు చేశారా? కూటమి ప్రభుత్వ నిర్వాకంకు విసిగిపోయిన మిర్చి రైతులు రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు అని మండిపడ్డారు.
![]() |
![]() |