AP: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం PS పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన విషయం తెలిసిందే. పాస్టర్ ప్రవీణ్ మృతిపై CM చంద్రబాబు విచారం చేశారు. అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాతో మాట్లాడిన సీఎం, పాస్టర్ మృతిపై ఆరా తీశారు. చాగల్లులో క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు బైక్‌పై రాజమండ్రి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని డీజీపీ చంద్రబాబుకి తెలిపారు.
![]() |
![]() |